Telangana: పాలవ్యాపారంలోకి మంత్రి హరీశ్‌రావు కుటుంబం.. ‘మిల్చి మిల్క్’ పేరుతో నయా బ్రాండ్ ఆవిష్కరణ

Telangana minister Harish rao wife start milk business
  • ఆవిష్కరించిన మంత్రి భార్య శ్రీనిత
  • స్వచ్ఛమైన పాలు, పాల పదార్థాలతో రోగనిరోధకశక్తి పెంపు
  • ఇంటి వద్దకే తాజా పాల ఉత్పత్తులు
తెలంగాణ మంత్రి హరీశ్‌రావు కుటుంబం పాలవ్యాపారంలోకి అడుగుపెట్టింది. ‘మిల్చి మిల్క్’ పేరుతో హరీశ్‌రావు భార్య శ్రీనిత శుక్రవారం పాల ఉత్పత్తులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనిత మాట్లాడుతూ.. ప్రస్తుత కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రతి ఒక్కరు రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్వచ్ఛమైన పాలు, పాల ఉత్పత్తులు ఇందుకు ఎంతగానో దోహదపడతాయన్నారు. వినియోగదారుల ఇంటి వద్దకే తాజా, స్వచ్ఛమైన పాలు, పాల ఉత్పత్తులను సరఫరా చేస్తామని శ్రీనిత పేర్కొన్నారు.
Telangana
Harish Rao
milchy milk
Srinitha

More Telugu News