Aditya Pancholi: తప్పుడు ఆరోపణలు చేస్తున్న కంగనానే పద్మశ్రీ తిరిగి ఇచ్చేయాలి: ఆదిత్య పంచోలీ

Aditya Pancholi demands Kangana must return her Padmasri
  • సుశాంత్ మరణం తర్వాత తీవ్ర ఆరోపణలు చేస్తున్న కంగనా
  • కరణ్ జోహార్ పద్మశ్రీని కేంద్రం వెనక్కి తీసుకోవాలని కామెంట్స్
  • కంగనా ఆరోపణలో నిజంలేదని తేలిపోయిందన్న పంచోలీ
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ తన గొంతుకను బలంగా వినిపిస్తోంది. బాలీవుడ్ లో బంధుప్రీతి రాజ్యమేలుతోందని, సుశాంత్ కూడా ఈ తరహా రాజకీయాలకే బలయ్యాడని ఆరోపించింది. ఈ క్రమంలో నిర్మాత కరణ్ జోహార్ పై విమర్శలు చేస్తూ, అతడి నుంచి పద్మశ్రీ అవార్డును కేంద్రం వెనక్కి తీసుకోవాలంటూ కోరింది. కాగా, ఈ అంశంలో బాలీవుడ్ సీనియర్ నటుడు ఆదిత్య పంచోలీ ఎంటరయ్యారు.

తప్పుడు ఆరోపణలు చేస్తున్న కంగనానే పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. సుశాంత్ మరణానికి బంధుప్రీతే కారణమన్న కంగనా వాదనలు అబద్ధాలని స్పష్టమైందని, సుశాంత్ తండ్రి చేసిన ఫిర్యాదులో ఎక్కడా బంధుప్రీతి అనే అంశంలేదని, ఆయన నటి రియా చక్రవర్తిపైనే ఫిర్యాదు చేశారని ఆదిత్య పంచోలీ వివరించారు. గతంలో కంగన కెరీర్ లో నిలదొక్కుకునే సమయంలో ఆదిత్య పంచోలీతో ప్రేమాయణం సాగించిందని అనేక కథనాలు వచ్చాయి.
Aditya Pancholi
Kangana Ranaut
Padmasri
Sushant Singh Rajput
Nepotism
Bollywood

More Telugu News