Chandana Ramesh: వైసీపీలో చేరిన రాజమండ్రి రూరల్ మాజీ ఎమ్మెల్యే చందన రమేశ్

Chandana Ramesh joins YCP in the presence of CM Jagan
  • వైసీపీ తీర్థం పుచ్చుకున్న చందన రమేశ్
  • రమేశ్ కు కండువా కప్పిన సీఎం జగన్
  • పార్టీలోకి సాదరంగా స్వాగతం
అధికార వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. రాజమండ్రి రూరల్ మాజీ ఎమ్మెల్యే చందన రమేశ్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. రమేశ్ కు సీఎం జగన్ సాదరంగా ఆహ్వానం పలికారు. చందన రమేశ్ ఇప్పటివరకు టీడీపీలో కొనసాగారు. గతంలో రాజమండ్రి గ్రామీణం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల్లో నెగ్గి అసెంబ్లీకి వెళ్లారు.
Chandana Ramesh
YSRCP
Jagan
Rajamandri
Rural
Telugudesam

More Telugu News