Vijay Sai Reddy: గవర్నర్ గారికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపాను: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy says he conveys his greetings to governor
  • ఈ మధ్యాహ్నం గవర్నర్ ను కలిసిన విజయసాయిరెడ్డి
  • ట్విట్టర్ లో వ్యాఖ్యలు చేసిన వర్ల రామయ్య
  • తన భేటీపై ట్వీట్ చేసిన విజయసాయిరెడ్డి
ఈ మధ్యాహ్నం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలవడం తెలిసిందే. దీనిపై టీడీపీ నేత వర్ల రామయ్య నిశిత వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి వెంట ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా రాజ్ భవన్ కు వెళ్లడం ఆశ్చర్యంగా ఉందంటూ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో తన భేటీపై విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. రేపు వినాయక చవితి పండుగను పురస్కరించుకుని గవర్నర్ ను కలిశానని, ఆయనకు గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు తెలియజేశానని వెల్లడించారు.
Vijay Sai Reddy
Governor
Ganesh Chaturthi
Varla Ramaiah

More Telugu News