Nara Lokesh: వెయిటింగ్ లో ఉన్నవారికి ఉద్యోగాలు ఇవ్వాలంటూ సీఎం జగన్ కు నారా లోకేశ్ లేఖ

Nara Lokesh writes to CM Jagan over ward and village secretariat employment notification
  • సచివాలయ నియామకాల నోటిఫికేషన్ పై లోకేశ్ స్పందన
  • మెరిట్ అభ్యర్థులకు అన్యాయం చేయొద్దని స్పష్టీకరణ
  • అర్హులతో పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్
ఏపీ సీఎం జగన్ కు నారా లోకేశ్ లేఖాస్త్రం సంధించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నియామక నోటిఫికేషన్ లో ఇప్పటికే సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయి, మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వాలని లోకేశ్ డిమాండ్ చేశారు.

అన్ని పోస్టులకు వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులే వేల సంఖ్యలో ఉన్నారని, ఇటువంటి పరిస్థితుల్లో మరో నోటిఫికేషన్ ఇవ్వడం అంటే వెయిటింగ్ లో ఉన్నవారికి అన్యాయం చేయడమే అవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రెండోసారి పరీక్ష నిర్వహించే అవకాశం లేదని, మొదటి నోటిఫికేషన్ లో అర్హత సాధించిన అభ్యర్థులతోనే పోస్టులను భర్తీ చేయాలని స్పష్టం చేశారు.
Nara Lokesh
Jagan
Letter
Ward/Village Secretariat
Notification
Andhra Pradesh

More Telugu News