రామ్... నీ సినిమాలు ఆ ఒక్క సామాజిక వర్గం వాళ్లే చూస్తారా?: వల్లభనేని వంశీ
- స్వర్ణ ప్యాలెస్ నేపథ్యంలో ఇటీవల రామ్ వ్యాఖ్యలు
- రామ్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదివాడన్న వంశీ
- చంద్రబాబు పైనా విమర్శలు చేసిన వంశీ
ఇటీవల రామ్ ట్విట్టర్ లో స్పందిస్తూ, కులం అనే జబ్బు కరోనా కంటే వేగంగా వ్యాపిస్తుందని, కరోనా కంటే ప్రమాదకరమైనదని వ్యాఖ్యానించాడు. నిశ్శబ్దంగా విస్తరించే ఈ మహమ్మారి నుంచి దూరంగా ఉండాలని పేర్కొన్నాడు.
ఇదే సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపైనా వంశీ విమర్శలు గుప్పించాడు. తమ సామాజిక వర్గానికి చంద్రబాబు ఒక్కడే నాయకుడు కాదని, గతంలో చాలామంది నాయకులు తమ వర్గం కోసం పనిచేశారని తెలిపారు. తమ సామాజిక వర్గానికి చంద్రబాబుతోనే ప్రమాదం ఉందని, చంద్రబాబు తనకున్న సమస్యలన్నింటినీ కులంపై రుద్దుతాడని విమర్శించారు.