MS Dhoni: నెట్ ప్రాక్టీసులో సిక్సర్ల వర్షం కురిపించిన ధోనీ... వీడియో ఇదిగో!

Dhoni hits massive sixes in net practice
  • త్వరలో ఐపీఎల్
  • సన్నద్ధమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు
  • బంతిని బలంగా బాదుతూ ఫామ్ చాటుకున్న ధోనీ
అంతర్జాతీయ క్రికెట్ కు ఇటీవలే గుడ్ బై చెప్పిన టీమిండియా దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ ఎంతో కసితో రగిలిపోతున్న విషయం చెన్నై సూపర్ కింగ్స్ నెట్ ప్రాక్టీసు చూస్తే అర్థమవుతుంది. గతేడాది ఇంగ్లాండ్ లో జరిగిన ప్రపంచకప్ తర్వాత ధోనీ టీమిండియాకు ఆడలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఐపీఎల్ ద్వారా తన బ్యాటింగ్, కీపింగ్ విన్యాసాలను అభిమానులకు ప్రదర్శించే వీలు చిక్కింది.

ఈ నేపథ్యంలో, సూపర్ కింగ్స్ జట్టు సన్నద్ధత కోసం నిర్వహించిన నెట్ ప్రాక్టీసు సెషన్ లో ధోనీ రెచ్చిపోయాడు. బంతిని బలంగా బాదుతూ స్డాండ్స్ లోకి పంపాడు. మునుపటి స్థాయిలో సిక్సర్లు కొట్టాడు. ధోనీ బాదుడు చూసి పక్కనే ఉన్న రైనా ఈల వేసి తన ఆనందాన్ని వ్యక్తం చేయడం విశేషం. కాగా, నెట్స్ లో ధోనీ బౌలింగ్ కూడా చేశాడు. ఈసారి ఐపీఎల్ పోటీలు యూఏఈలో జరగనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబరు 19న మొదలయ్యే ఐపీఎల్ 13వ సీజన్ నవంబరు 10తో ముగుస్తుంది.

MS Dhoni
Sixers
Net Practice
Chennai Super Kings
IPL 2020

More Telugu News