AP High Court: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో 16 మందికి హైకోర్టు నోటీసులు

  • ఫోన్ ట్యాపింగ్ పై హైకోర్టులో పిటిషన్
  • విచారణ చేపట్టిన హైకోర్టు
  • సీబీఐతో పాటు పలు మొబైల్ ఆపరేటర్లకు నోటీసులు
High court issues notices to sixteen members in phone tapping issue

ఏపీలో విపక్ష నేతలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు, న్యాయవాదుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ అధికార వైసీపీపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో సీబీఐతో పాటు రిలయన్స్, వొడాఫోన్, ఎయిర్ టెల్, జియో, బీఎస్ఎన్ఎల్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడికి కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసులకు నాలుగు వారాల్లో సమాధానాలు పంపాలని స్పష్టం చేసింది. వ్యక్తిగతంగా కానీ, న్యాయవాది ద్వారా కానీ హాజరు కావాలని పేర్కొంది.

More Telugu News