CM Ramesh: నాకు కరోనా నెగెటివ్ వచ్చింది... సంతోషంగా వెల్లడించిన సీఎం రమేశ్

CM Ramesh expresses his joy after he tested corona negetive
  • రెండు వారాల కిందట సీఎం రమేశ్ కు కరోనా పాజిటివ్
  • హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందిన ఎంపీ
  • ఇప్పుడు కరోనా నయమైందంటూ ట్వీట్
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ తనకు కరోనా నయమైందని వెల్లడించారు. తాజా వైద్య పరీక్షల్లో తనకు కరోనా నెగెటివ్ వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. "దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా క్షేమం కోసం ప్రార్థించిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. కరోనాపై నా పోరాటంలో సహకరించిన డాక్టర్లకు, ఇతర వైద్య సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు. త్వరలోనే నా కార్యక్రమాలు కొనసాగిస్తాను" అని వెల్లడించారు. రెండు వారాల కిందట సీఎం రమేశ్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పటినుంచి ఆయన హోమ్ ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందారు.
CM Ramesh
Corona Virus
Negetive
Home Isolation
BJP

More Telugu News