New Delhi: కరోనాతో మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు.. కోటి రూపాయల చెక్ అందజేసిన కేజ్రీవాల్

Delhi CM gives Rs 1 cr compensation for Covid warriors death
  • విధుల్లో ఉండి కరోనా బారినపడి మృతి చెందిన రాజు
  • బాధిత కుటుంబ సభ్యలను పరామర్శించి చెక్ అందించిన కేజ్రీవాల్
  • అలాంటి అంకితభావం కలిగిన వారియర్ ఉండడం గర్వకారణమన్న సీఎం
కరోనాతో మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు రాజు కుటుంబానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోటి రూపాయల పరిహారం అందించారు. కరోనా విధుల్లో ఉండగా రాజు ఆ మహమ్మారి బారినపడ్డాడు. చికిత్స పొందుతూ మరణించాడు. విధుల్లో ఉండి కరోనా బారినపడి మరణించే వారికి కోటి రూపాయల పరిహారం ఇవ్వనున్నట్టు కేజ్రీవాల్ గతంలోనే ప్రకటించారు. అందులో భాగంగా తాజాగా రాజు ఇంటికి వెళ్లిన సీఎం.. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం కోటి రూపాయల చెక్‌ను వారికి అందించారు.  అనంతరం కేజ్రీవాల్ మాట్లాడతూ.. రాజు ప్రజలకు సేవ చేస్తూ చనిపోయాడని, అలాంటి అంకితభావం కలిగిన కొవిడ్ వారియర్ ఉండడం గర్వకారణమని పేర్కొన్నారు.
New Delhi
Arvind Kejriwal
COVID-19
sanitation worker

More Telugu News