ప్రమాదం నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ శ్రీశైలం పర్యటన రద్దు
- శ్రీశైలంలో నేడు పూజలు నిర్వహించాల్సిన జగన్
- అక్కడి జలవిద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం
- సాయం కావాలంటే అందించాలని ఆదేశం
షార్ట్ సర్క్యూట్ కారణంగా గత రాత్రి సంభవించిన ప్రమాదంలో నాలుగు టన్నెళ్లు పేలిపోయాయి. ప్రమాదంలో ఆరుగురు కార్మికులు చిక్కుకుపోయారు. ప్రస్తుతం సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్లి పూజా కార్యక్రమాలు నిర్వహించడం సబబు కాదని సీఎం జగన్ అధికారులకు చెప్పారు. ఈ నేపథ్యంలోనే పర్యటనను రద్దు చేసుకున్నారు. సహాయ కార్యక్రమాల కోసం ఏపీ నుంచి ఎటువంటి సాయం కావాలన్నా వెంటనే సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.