Rakul Preet Singh: క్రిష్ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ప్రయోగం!

Rakul Preeth Singh to do deglamarized role
  • క్రిష్ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ 
  • ప్రస్తుతం వికారాబాద్ అడవుల్లో షూటింగ్
  • గ్రామీణ రైతు కూలీగా కథానాయిక పాత్ర  
  • మేకప్ లేకుండా నటిస్తున్న రకుల్
మన అందాల హీరోయిన్లు అప్పుడప్పుడు ప్రయోగాలకు సిద్ధపడుతుంటారు. తదుపరి సినిమాలో మరింత అందంగా ఎలా కనిపించాలా? అని ఎప్పుడూ ఆలోచించే ఈ అందాలతారలు, హఠాత్తుగా డీ-గ్లామరైజ్డ్ పాత్రలో నటిస్తుంటారు. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కూడా అలాంటి ప్రయోగానికే రెడీ అయింది.

ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఓ చిత్రం రూపొందుతోంది. ఇందులో రకుల్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ గత నాలుగు రోజులుగా హైదరాబాదు సమీపంలోని వికారాబాద్ అడవుల్లో నిర్వహిస్తున్నారు.

ఇక ఇందులో మన గ్రామీణ ప్రాంతాలలో కనిపించే రైతు కూలీ యువతి పాత్రలో రకుల్ నటిస్తోంది. దీంతో ఆమె మేకప్ లేకుండా.. సాదాసీదా డ్రెస్సింగ్ తో కనిపిస్తుందట. ఇన్నాళ్లూ ఓ గ్లామరస్ తారగా ప్రేక్షకులకు కనిపించిన రకుల్.. ఇలా డీ-గ్లామర్ పాత్రను పోషించడం ఓ ప్రయోగం, అంతకుమించి సాహసమనే చెప్పాలి.  
Rakul Preet Singh
Krish
Vaishnav Tej

More Telugu News