అధికారిక ప్రకటన.. నాని 'వి' అమెజాన్ ప్రైమ్ లో విడుదల
- ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో 'వి'
- నానితో పాటు సుధీర్ బాబు కీలక పాత్ర
- అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్
ఈ నేపథ్యంలో నాని హీరోగా నటించిన 'వి' చిత్రం మార్చి 25న థియేటర్ రిలీజ్ కావలసివుంది. అయితే, లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇక ఇప్పుడు ఇది కూడా ఓటీటీ ద్వారా విడుదల కానుండడం ఓ విశేషంగా చెప్పుకోవాలి. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. నానితో పాటు ఇందులో సుధీర్ బాబు కీలక పాత్ర పోషించాడు. అదితీరావు హైదరి, నివేద థామస్ హీరోయిన్లుగా నటించారు.