Rana Daggubati: ఆదిపురుష్ ప్రభాస్, రాక్‌స్టార్ శ్రుతి హాసన్‌ కోసం ఈ రెండు మొక్కలు నాటాను: రానా

Rana Daggubat   GreenIndiaChallenge
  • ఇటీవల మొక్కలు నాటిన ప్రభాస్, శ్రుతి
  • రానాకు ఛాలెంజ్‌
  • ఇద్దరి ఛాలెంజ్‌లనూ స్వీకరించిన రానా
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, హీరోయిన్ శ్రుతి హాసన్‌ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను సినీనటుడు రానా స్వీకరించాడు. ఈ రోజు ఉదయం రామానాయుడు స్టుడియోలో రానా మొక్కలు నాటాడు. 'కాస్త ఆలస్యమైంది.. అయినప్పటికీ ఆది పురుష్ ప్రభాస్‌ కోసం ఒక మొక్క, రాక్‌స్టార్‌ శ్రుతి హాసన్‌ కోసం మరో మొక్క నాటాను. నన్ను ఫాలో అవుతోన్న ప్రతి ఒక్కరికీ నేను గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను విసురుతున్నాను' అని రానా పేర్కొన్నాడు. మొక్కలు నాటి ట్వీట్ చేయాలని కోరాడు. ఇటీవల మొక్కలు నాటిన ప్రభాస్‌, శ్రుతిహాసన్ ఇద్దరూ రానాకు ఈ సవాలు విసిరిన విషయం తెలిసిందే.
Rana Daggubati
Prabhas
Green India Challenge

More Telugu News