Nani: అధికారిక ప్రకటన.. నాని 'వి' అమెజాన్ ప్రైమ్ లో విడుదల

Nanis V film to be streamed on Amezon Prime
  • ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో 'వి'
  •  నానితో పాటు సుధీర్ బాబు కీలక పాత్ర
  • అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్
కరోనా దెబ్బకు థియేటర్లు మూతబడడంతో, చాలా మంది తమ సినిమాలను డిజిటల్ ప్లాట్ ఫాంలపై విడుదల చేస్తున్న విషయం విదితమే. అయితే, పెద్ద హీరోలు మాత్రం తమ సినిమాలను ఓటీటీ ద్వారా విడుదల చేయడానికి ఇష్టపడడం లేదు. థియేటర్లలో విడుదల చేస్తేనే తమ ఇమేజ్ కి అనుగుణంగా ఉంటుందనీ, అభిమానులకు మజా ఉంటుందనీ భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో నాని హీరోగా నటించిన 'వి' చిత్రం మార్చి 25న థియేటర్ రిలీజ్ కావలసివుంది. అయితే, లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇక ఇప్పుడు ఇది కూడా ఓటీటీ ద్వారా విడుదల కానుండడం ఓ విశేషంగా చెప్పుకోవాలి. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. నానితో పాటు ఇందులో సుధీర్ బాబు కీలక పాత్ర పోషించాడు. అదితీరావు హైదరి, నివేద థామస్ హీరోయిన్లుగా నటించారు.
Nani
Sudheer Babu
Aditi Rao
Nivetha Thomas

More Telugu News