Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ పిటిషన్ పై విచారణ ఈ నెల 27కి వాయిదా

High court adjourns phone tapping hearing to next Thursday
  • ఏపీలో ఫోన్ ట్యాపింగ్ రగడ
  • ఫోన్ ట్యాపింగ్ పై హైకోర్టులో పిటిషన్
  • పిటిషనర్ అఫిడవిట్ ను ప్రధాన పిటిషన్ కు జోడించాలన్న కోర్టు
ఏపీలో ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కలకలం బయల్దేరిన సంగతి తెలిసిందే. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు దీనిపై ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. ప్రస్తుతం ఈ అంశం ఏపీలో చర్చనీయాంశంగా ఉంది.

ఈ క్రమంలో, న్యాయమూర్తులు, లాయర్లు, ఇతర ప్రముఖల ఫోన్లు ట్యాపింగ్ కు గురయ్యాయంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా, ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ, పిటిషనర్ అఫిడవిట్ ను ప్రధాన పిటిషన్ కు జత చేయాలని న్యాయస్థానం ఆదేశించిందని తెలిపారు. రెండ్రోజుల్లో అనుసంధాన పిటిషన్ వేయాలని సూచించిందని వివరించారు.
Phone Tapping
AP High Court
Petition
Affidavit

More Telugu News