Allu Arjun: గడ్డం పెంచేసి, విభిన్న హెయిర్‌ స్టైల్‌తో అల్లు అర్జున్.. సరికొత్త లుక్‌ ఫొటోలు వైరల్

Allu Arjun Casually dropped in Geetha Arts after a long time
  • గీతా ఆర్ట్స్ ఆఫీసుకి వెళ్లిన బన్నీ
  • ఎన్నో అనుభూతులను కోల్పోతున్నానన్న హీరో
  • ఈ క్లిష్ట పరిస్థితులు పోవాలని ట్వీట్
కరోనా విజృంభణ నేపథ్యంలో షూటింగులు ఆగిపోవడంతో ఇంటి వద్దే గడుపుతోన్న సినీనటుడు అల్లు అర్జున్ తాజాగా బయటకు వెళ్లాడు. తమ గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్ద తీసుకున్న స్టైలిష్ ఫొటోలను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
                                  
'చాలా రోజుల తర్వాత గీతా ఆర్ట్స్‌ కార్యాలయానికి వచ్చాను. ఎన్నో అనుభూతులను కోల్పోతున్నాను. ఈ క్లిష్ట పరిస్థితులు త్వరలోనే ముగియాలని కోరుకుంటున్నాను. సురక్షితంగా ఉండండి' అని బన్నీ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా అక్కడ తీసుకుని పోస్ట్ చేసిన ఆయన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. గడ్డం పెంచేసి, కొత్త హెయిర్‌ స్టైల్‌తో సరి కొత్త లుక్‌లో అల్లు అర్జున్ కనపడుతున్నాడు.
Allu Arjun
Tollywood
Viral Pics

More Telugu News