Andhra Pradesh: వినాయక చవితిని ఇంట్లోనే జరుపుకోండి.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

AP Govt Issues orders on Vinayaka Chavithi
  • ఏపీలో కొనసాగుతున్న కరోనా విజృంభణ
  • వినాయక మండపాలకు అనుమతి నిల్
  • పూజా సామగ్రి కొనుగోలులో కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచన
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఒక్కరు పండుగను ఇంట్లోనే జరుపుకోవాలని సూచించింది. గణేశ్ మండపాలకు అనుమతి ఇస్తున్నట్టు ఉత్తర్వుల్లో ఎక్కడా పేర్కొనలేదు. అంటే బహిరంగ ప్రదేశాల్లో సామూహిక పూజలు ఇక ఉండనట్టే.

ఇక, గణేశ్ చవితి సందర్భంగా పూజా సామగ్రి కొనుగోలు కోసం బయటకు వచ్చినవారు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని పేర్కొంది. దేవాలయాల్లోనూ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను పాటించాలని పేర్కొంది.
Andhra Pradesh
Corona Virus
Vinayaka chavithi

More Telugu News