APSRTC: ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులకు రూ. 50 లక్షల కరోనా బీమా!

APSRTC Employees now get Rs 50 lakh insurance
  • ఆర్టీసీ కార్మికులకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ వర్తింపు
  • ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన 36 మందికీ వర్తింపు
  • ఈ నెల 28లోపు ధ్రువపత్రాలు పీఎంవోకు పంపాలని ఆదేశం
ఆర్టీసీ కార్మికులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీని వర్తింపజేసింది. ఇందులో భాగంగా ఒక్కో కార్మికుడికి రూ. 50 లక్షల కొవిడ్ బీమా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అంతేకాదు, కరోనా బారినపడి ఇప్పటి వరకు మృతి చెందిన 36 మంది సిబ్బందికి కూడా ఈ బీమా అమలు చేయనున్నట్టు తెలిపింది. ఈ మేరకు మృతి చెందిన వారి వివరాలను, ధ్రువపత్రాలతో కలిపి పంపాలని రీజనల్ మేనేజర్లను ఆదేశించింది. ఈ నెల 28లోపు ప్రధానమంత్రి కార్యాలయానికి వాటిని పంపే పనులు పూర్తి చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.
APSRTC
COVID-19
Insurance
Andhra Pradesh
PMO

More Telugu News