Sunitha: కరోనా బారినపడ్డాను... కోలుకున్నాను: సింగర్ సునీత

Singer Sunitha says that she has recovered from corona
  • షూటింగ్ లో తలనొప్పితో బాధపడిన సునీత
  • టెస్టు చేయించుకుంటే కరోనా పాజిటివ్ వచ్చిన వైనం
  • ఐసోలేషన్ లోకి వెళ్లానని వెల్లడి
టాలీవుడ్ ప్రముఖుల్లో పలువురు కరోనా వైరస్ ప్రభావానికి గురై తమ అనుభవాలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా సింగర్ సునీత కూడా తాను కరోనా బారినపడ్డానని, ఇప్పుడు కోలుకున్నానని వెల్లడించారు. ఓ షూటింగ్ కు వెళ్లిన సమయంలో తలనొప్పిగా అనిపించిందని, వెంటనే కరోనా టెస్టులు చేయించుకుంటే పాజిటివ్ అని వచ్చిందని వివరించారు.

తనకు స్వల్ప లక్షణాలే ఉన్నా, తన తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని వెంటనే పరీక్షలు చేయించుకున్నానని తెలిపారు. పాజిటివ్ రావడంతో ఐసోలేషన్ లో ఉండిపోయానని, ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నానని సునీత వెల్లడించారు. వైద్యుల సలహాలు పాటిస్తూ, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనాను జయించానని, కానీ ఎస్పీ బాలుసుబ్రహ్మణ్యం గారి పరిస్థితి ఎంతో ఆందోళన కలిగిస్తోందని సునీత విచారం వ్యక్తం చేశారు. అందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నానని, తనపై అభిమానులు, శ్రేయోభిలాషులు చూపిన ఆదరణకు కృతజ్ఞతలు అంటూ వివరించారు.
Sunitha
Singer
Corona Virus
Tollywood

More Telugu News