Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నరా? బీజేపీ అధ్యక్షురాలా?: టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఆగ్రహం

TRS Leaders fire on Governer Tamilisai
  • కరోనా విషయంలో సర్కారు విఫలం
  • సంచలన వ్యాఖ్యలు చేసిన తమిళిసై
  • తీవ్ర విమర్శలు చేస్తున్న టీఆర్ఎస్ నేతలు
ఎంతో అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రానికి గౌరవ ప్రదమైన గవర్నర్ బాధ్యతల్లో ఉన్న తమిళిసై సౌందరరాజన్, బీజేపీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. తాజాగా, ఆమె తెలంగాణలో కరోనా పరీక్షల విషయమై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

 రాష్ట్రంలో కరోనా పరీక్షలు తక్కువగా చేస్తున్నారని, ఆసుపత్రులపైనా దృష్టిని సారించడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. ఆపై కరోనా నమూనాల పరీక్షల సంఖ్య రాష్ట్రంలో చాలా తక్కువని తన ట్విట్టర్ ఖాతాలోనూ ట్వీట్ చేశారు. దీంతో టీఆర్ఎస్ నేత, హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి తీవ్రంగా స్పందించారు. బీజేపీకి అధ్యక్షురాలిగా ఉండి విమర్శలు చేయాలనుకుంటే, గవర్నర్ పదవికి రిజైన్ చేయాలని అన్నారు. పలువురు పార్టీ నేతలు సైతం గవర్నర్ వ్యాఖ్యలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
Tamilisai Soundararajan
Telangana
Corona Virus

More Telugu News