Chandrababu: మోదీకి లేఖ రాస్తే డీజీపీ స్పందించడం విడ్డూరంగా ఉంది: చంద్రబాబు

Chandrababu comments on AP DGP over phone tapping issues
  • ఫోన్ ట్యాపింగ్ వైసీపీకి అలవాటేనన్న చంద్రబాబు
  • గతంలో సీబీఐ మాజీ జేడీ ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఆరోపణ
  • డాక్టర్ల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారని వెల్లడి
ఫోన్ ట్యాపింగ్ పై తాను చేసిన ఆరోపణలపై వెనక్కి తగ్గరాదని, దీనిపై మరింత పోరాటం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది వైసీపీకి ఎప్పట్నించో ఉన్న అలవాటని విమర్శించారు. గతంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఫోన్ కూడా వైసీపీనే ట్యాప్ చేసిందని ఆరోపించారు.

కాగా, రాష్ట్రంలో ఫోన్ల ట్యాపింగ్ పై చర్యలు తీసుకోవాలంటూ తాను ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తే, ఏపీ డీజీపీ స్పందించడం విడ్డూరంగా ఉందని అన్నారు. సాక్ష్యాలు కావాలంటూ డీజీపీ తనకు లేఖ రాయడం పట్ల చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. సాక్ష్యాలు కోరుతున్న డీజీపీ గతంలో రాసిన లేఖలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. ఇప్పుడు డాక్టర్ల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారని, రోగులతో ఫోన్ లో మాట్లాడాలన్నా డాక్టర్లు హడలిపోయే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు వివరించారు.
Chandrababu
DGP
Narendra Modi
Phone Tapping
YSRCP
Andhra Pradesh

More Telugu News