Jagan: ఇది మన ఇంట్లో సమస్యే అనుకుందాం... వరద పరిస్థితిపై సీఎం జగన్ వ్యాఖ్యలు

  • గోదావరి వరదలపై సీఎం సమీక్ష
  • వరద బాధితులకు రూ.2 వేల చొప్పున సాయం
  • 10 రోజుల్లో పంట నష్టం వివరాలు పంపాలని ఆదేశాలు
CM Jagan reviews Godavari flood situations

భారీ వర్షాల కారణంగా గోదావరి ఉప్పొంగడంతో ఉభయ గోదావరి జిల్లాలు వరద ప్రభావంతో అతలాకుతలం అయ్యాయి. ఈ పరిస్థితులపై సీఎం జగన్ స్పందించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వరద బాధితుల పట్ల ఉదారంగా వ్యవహరించాలని, ఇది మన ఇంట్లో సమస్యగానే భావించి చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. వరద బాధిత కుటుంబాలకు రూ.2 వేల చొప్పున ఆర్థికసాయం అందజేయనున్నట్టు ప్రకటించారు.

వరద తగ్గుముఖం పట్టిన తర్వాత ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పది రోజుల్లో పంట నష్టం అంచనాలు పంపించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మరో మూడ్రోజుల్లో గోదావరి శాంతించే అవకాశం ఉందని, వేగంగా స్పందించి విద్యుత్, సమాచార సేవలను పునరుద్ధరించాలని ఆదేశించారు. అధికారులే కాకుండా, ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు కూడా సహాయ చర్యల్లో పాలుపంచుకోవాలని సీఎం సూచించారు.

అంతకుముందు ఆయన వరద పరిస్థితిని జిల్లాల కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించన్నుట్టు వెల్లడించారు.

More Telugu News