Somu Veerraju: గత ప్రభుత్వానిది ప్రచార ఆర్భాటం, ఈ ప్రభుత్వానిది క్రియా శూన్యత: సోము వీర్రాజు

Somu Veerraju criticizes TDP and YCP over flood effected Polavaram villages
  • పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సోము
  • వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వెల్లడి
  • పోలవరం ప్రజలకు బీజేపీ అండగా ఉంటుందని హామీ
ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు ఇవాళ పోలవరం పరిధిలోని ముంపు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానిస్తూ... గత ప్రభుత్వ ప్రచార ఆర్భాటం, ప్రస్తుత ప్రభుత్వ క్రియా శూన్యత కారణంగా సరైన ప్లానింగ్ లేక, కాఫర్ డ్యాం ఎత్తు పెంపుదల వల్ల అనేక గిరిజన గ్రామాల ప్రజలకు, వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు.

ముంపు పరిస్థితులు తన మనసును కలచివేశాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వారికి న్యాయం చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ముంపు గ్రామాలకు, పోలవరం ప్రాంత ప్రజలకు బీజేపీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
Somu Veerraju
Polavaram Project
Flood
YSRCP
Telugudesam
BJP
Andhra Pradesh

More Telugu News