KTR: వరద ప్రాంతాల్లో కేటీఆర్ పర్యటన!

KTR and Ministers of Telangana Ariel Survey in Flood Areas
  • ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే
  • బాధితులతో మాట్లాడిన తెలంగాణ మంత్రులు
  • ప్రభుత్వం సాయం చేస్తుందని కేటీఆర్ హామీ
తెలంగాణ ఐటీ, మునిసిపల్ మంత్రి కె.తారక రామారావు, ఈ ఉదయం వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. స్వయంగా వెళ్లి, బాధితులను పరామర్శించి రావాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఈటల రాజేందర్ లతో కలిసి, హెలికాప్టర్ లో ఏరియల్ సర్వే నిర్వహించిన ఆయన, ముంపు ప్రాంతాలను సందర్శించారు. అక్కడి వరద బాధితులతో మాట్లాడి, ప్రభుత్వం తరఫున సహాయ, సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా, గడచిన ఐదారు రోజులుగా కురుస్తున్న వర్షం, నిన్న సాయంత్రం నుంచి కాస్తంత తెరిపినిచ్చినప్పటికీ, పలు ప్రాంతాల్లో వరద నీరు నిలిచే వుంది. దీంతో అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు.
KTR
Flood
Ariel Survey
Etala
Errabelli

More Telugu News