SP Balasubrahmanyam: ఎస్పీ బాలు ఆరోగ్యం విషమంగానే ఉంది... బులెటిన్ విడుదల చేసిన ఎంజీఎం ఆసుపత్రి

MGM Hospital says SP Balasubrahmanyam health still critical
  • చెన్నై ఆసుపత్రిలో బాలుకు కరోనా చికిత్స
  • ఇంకా వెంటిలేటర్ పైనే ఉన్నారన్న ఆసుపత్రి వర్గాలు
  • బాలు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని వెల్లడి
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై చెన్నై ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు ప్రత్యేక బులెటిన్ విడుదల చేశాయి. ఎస్పీ బాలు కరోనాతో తమ ఆసుపత్రిలో చేరారని, ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉందని స్పష్టం చేశాయి. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోందని, నిపుణులైన వైద్యుల బృందం బాలు గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటోందని, ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని ఆ బులెటిన్ లో పేర్కొన్నారు. ఈ బులెటిన్ ను ఆసుపత్రి వైద్య సేవల విభాగం ఏడీ డాక్టర్ అనురాధ భాస్కరన్ విడుదల చేశారు.
SP Balasubrahmanyam
MGM Hospital
Chennai
Bulletin
Corona Virus

More Telugu News