Erragadda Hospital: ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలోనే 36 పాజిటివ్ కేసులు

36 Corona cases registered in Erragadda mental hospital
  • తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు 
  • ఎర్రగడ్డ ఆసుపత్రిలో సిబ్బంది, రోగులకు కరోనా
  • అక్కడే ఉన్న కరోనా కేర్ సెంటర్ కు తరలింపు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. నగర ప్రజలు భయాందోళనలతోనే బతుకుతున్నారు. మరోవైపు హైదరాబాదులోని ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో కరోనా కలకలం రేపింది. గత 24 గంటల్లో ఈ ఆసుపత్రిలో 36 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఆసుపత్రి సిబ్బందితో పాటు, మానసిక రోగులు కూడా ఉన్నారు. వీరందరినీ అక్కడే  నిర్వహిస్తున్న కరోనా కేర్ సెంటర్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 92 వేలను దాటింది. మరణాల సంఖ్య 700 దాటింది.
Erragadda Hospital
Corona Virus
Hyderabad

More Telugu News