GV Harsha Kumar: మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ కు కరోనా పాజిటివ్

Former MP GV Harsha Kumar tested positive for corona
  • ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి
  • కరోనా బాధితుల జాబితాలో చేరిన అమలాపురం మాజీ ఎంపీ
  • రాజకీయ నేతలనూ వదలని వైరస్ మహమ్మారి

కరోనా మహమ్మారి విజృంభణ ఏపీలో తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ కరోనా బాధితుల జాబితాలో చేరారు. ఆయనకు వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. హర్షకుమార్ ఆరోగ్య పరిస్థితి గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, ఏపీలో ప్రజాప్రతినిధులు, నేతలు కూడా కరోనా బారినుంచి తప్పించుకోలేకపోతున్నారు. పలువురు వైసీపీ అగ్రనేతల సహా, టీడీపీ నేతలు కూడా కరోనా వైరస్ కు గురయ్యారు. విజయసాయిరెడ్డి, అంజాద్ బాషా, అంబటి రాంబాబు, బాలినేని శ్రీనివాసరెడ్డి, అచ్చెన్నాయుడు, వేగుళ్ల జోగేశ్వరరావు వంటి నేతలు కరోనా బాధితులయ్యారు.

  • Loading...

More Telugu News