Kim Jong Un: ఉత్తర కొరియాలో తీవ్ర ఆహారకొరత... పెంపుడు కుక్కలను ప్రభుత్వానికి అప్పగించాలంటూ కిమ్ ఆదేశాలు

Kim orders people to be handed over their pet dogs to government
  • కుక్కను కలిగివుండడం బూర్జువా ధోరణికి నిదర్శనమన్న కిమ్
  • పట్టుకున్న కుక్కలను రెస్టారెంట్లకు అప్పగింత
  • కిమ్ పై వ్యతిరేకుల ఆగ్రహం
ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ మరోసారి తన మార్కు నిర్ణయం ఎలావుంటుందో చాటిచెప్పారు. దేశంలో ఆహార కొరత తీవ్రమైన నేపథ్యంలో, ప్రజలు తమ పెంపుడు కుక్కలను ప్రజలకు అప్పగించాల్సిందిగా ఆదేశించారు. జూలైలో ఆయన కొత్త విధానం ప్రకటించారు. ఎవరైనా గానీ పెంపుడు కుక్కను కలిగివుండడం జాతీయ చట్టానికి వ్యతిరేకం అని హుకుం జారీ చేశారు. అంతేకాదు, పెంపుడు కుక్కను కలిగివుండడం కళంకిత బూర్జువా విధానానికి ప్రతీక అని కిమ్ సూత్రీకరించారు.

కిమ్ ఆదేశాలు ఇచ్చిందే తరువాయి, అధికారులు పెంపుడు కుక్కలు ఉన్న ఇళ్లను గుర్తించి, వాటిని పట్టుకునే చర్యల్లో నిమగ్నమయ్యారు. ఈ శునకాలను ప్రభుత్వం నిర్వహించే జూలకు గానీ, కుక్కమాంసం వంటకాలు విక్రయించే రెస్టారెంట్లకు గానీ తరలించనున్నారు. కొరియాలో కుక్కమాంసం తినడం ఎప్పట్నించో ఉంది. అయితే, కుక్కమాంసం తినే అలవాటు దక్షిణ కొరియాలో క్రమంగా తగ్గిపోతుండగా, కిమ్ మాత్రం ఆహార కొరత నేపథ్యంలో పెంపుడు కుక్కలపై పడ్డారని అతడి వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు.
Kim Jong Un
Pet Dogs
Government
Meat
Food Shortage

More Telugu News