పందెం కాయగలను... ధోనీ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరు: గౌతమ్ గంభీర్
- ధోనీ కెప్టెన్సీలో మూడు ఐసీసీ ట్రోఫీలు
- సెంచరీల రికార్డులు భవిష్యత్తులో బద్దలు కావచ్చు
- ధోనీ రికార్డు మరే కెప్టెన్ కూ సాధ్యం కాదు
- క్రికెట్ కనెక్టెడ్ షోలో గౌతమ్ గంభీర్
"ధోనీ పేరు చెబితే, ఓ రికార్డు గుర్తుకు వస్తుంది. అది ఎల్లకాలమూ ధోనీ పేరిటే నిలిచి వుంటుందని చెప్పగలను. ఈ విషయమై నేను పందెం కాయగలను. మూడు ఐసీసీ ట్రోఫీలను దేశానికి అందించిన ఘటన ధోనీదే. టీ-20 వరల్డ్ కప్, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, 2011 వరల్డ్ కప్ లను ధోనీ నేతృత్వంలోనే గెలిచాము. మరే కెప్టెన్ కూ ఇది సాధ్యం కాదని నమ్ముతున్నాను. సెంచరీల రికార్డులు ఏనాటికైనా బద్దలవుతాయి. భవిష్యత్తులో మరెవరైనా వచ్చి, డబుల్ సెంచరీల విషయంలో రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేయవచ్చు. కానీ, భారత కెప్టెన్ గా ధోనీ సాధించిన రికార్డు పదిలంగా ఉండిపోతుంది" అన్నారు గంభీర్.