Vegulla Jogeswararao: మండపేట టీడీపీ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్

TDP MLA Vegulla Jogeswararao tested corona positive
  • కరోనా బారినపడిన వేగుళ్ల జోగేశ్వరరావు
  • హైదరాబాద్ స్టార్ హోటల్లో చికిత్స
  • నిలకడగా ఆరోగ్యం
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అంతకంతకు అధికమవుతోంది తప్ప తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడంలేదు. సామాన్యులే కాదు ప్రజాప్రతినిధులు సైతం కరోనబారిన పడుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా మండపేట టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

ఆయన హైదరాబాదులోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జోగేశ్వరరావు ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలో ఇప్పటికే అనేకమంది వైసీపీ నేతలకు కరోనా సోకింది. విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కోన రఘుపతి, అంజాద్ బాషా, అంబటి రాంబాబు తదితరులు కరోనా బాధితుల జాబితాలో చేరారు.
Vegulla Jogeswararao
Corona Virus
Positive
Star Hospital
Hyderabad
Mandapeta
Telugudesam

More Telugu News