Ram: ఈ వ్యవహారంలో ఇక ట్వీట్లు చేయను: హీరో రామ్

Hero Ram says he wont tweet anymore in the ongoing issue
  • చెప్పాల్సిందంతా చెప్పేశానన్న రామ్
  • న్యాయంపై నమ్మకం ఉందని వెల్లడి
  • దోషులు తప్పక శిక్షింపబడతారని వ్యాఖ్యలు
విజయవాడ రమేశ్ ఆసుపత్రి వ్యవహారంలో నిన్న హీరో రామ్ చేసిన వ్యాఖ్యలు అందరిలోనూ విస్మయాన్ని కలిగించాయి. సాధారణంగా ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉండే రామ్ ఒక్కసారిగా ఏపీ వ్యవహారాల్లో స్పందించడం చర్చనీయాంశంగా మారింది. అయితే, రమేశ్ ఆసుపత్రి వ్యవహారంలో తమకు ఆటంకం కలిగిస్తే హీరో రామ్ కు కూడా నోటీసులు పంపుతామని విజయవాడ ఏసీపీ సూర్యచంద్రరావు స్పష్టం చేశారు. ఈ క్రమంలో హీరో రామ్ ఆసక్తికర ట్వీట్ చేశారు.

ఈ వ్యవహారంలో ఇకపై తాను ఎలాంటి ట్వీట్లు చేయబోనని తెలిపారు. "నాకు న్యాయంపై నమ్మకం ఉంది. నిజమైన దోషులు ఎవరైనా, ఎవరికి చెందినవారైనా తప్పకుండా శిక్షించబడతారని కచ్చితంగా చెప్పగలను. ఈ వ్యవహారంలో ఇక ట్వీట్లు చేయాలనుకోవడంలేదు. ఎందుకంటే, ఈ వ్యవహారంలో చెప్పాల్సిందంతా ఇప్పటికే చెప్పేశాను" అంటూ స్పందించారు.
Ram
Ramesh Hospitals
Tweet
ACP
Vijayawada

More Telugu News