Karnataka: హింస చెలరేగిన బెంగళూరులోని ప్రాంతాల్లో ఆర్‌ఏఎఫ్‌ 'ఫ్లాగ్‌ మార్చ్‌'.. వీడియో ఇదిగో

Personnel of Rapid Action Force conduct flag march
  • డీజే హళ్లీ, కేజీ హళ్లీ ప్రాంతాల్లో ఇటీవల హింస
  • ఆయా ప్రాంతాల్లో పోలీసుల చర్యలు
  • ఇప్పటివరకు 200 మందికి పైగా అరెస్టు
  • ఈ నెల 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు 144 సెక్షన్  
ఇటీవల కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి మేనల్లుడు నవీన్‌ ఫేస్‌బుక్‌లో ఓ కమ్యూనల్‌ పోస్టు షేర్‌ చేయగా వివాదం రాజుకుని హింసకు దారి తీసిన విషయం తెలిసిందే. బెంగళూరులోని డీజే హళ్లీ, కేజీ హళ్లీ ప్రాంతాల్లో జరిగిన ఈ హింస వల్ల పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, చాలా మందికి గాయాలయ్యాయి. పోలీసులు ఆయా ప్రాంతాల్లో ఇప్పటివరకు 200 మందికి పైగా అరెస్టు చేశారు.

ఈ ప్రాంతాల్లో ఎలాంటి అల్లర్లు చెలరేగకుండా విధించిన 144 సెక్షన్ ఈ నెల 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రాంతాల్లో చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పర్సనల్ ఆఫ్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఏఎఫ్) ఫ్లాగ్‌ మార్చ్ నిర్వహించింది. ఎలాంటి శాంతి, భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులతో కలిసి పనిచేస్తోంది.
Karnataka
Crime News
Police

More Telugu News