Rahul Gandhi: ప్రధాని మోదీ పిరికితనం వల్లే ఇలా జరిగింది: రాహుల్ గాంధీ

Cowardice allowed China to take our land Rahul Gandhi
  • భారత ఆర్మీ సామర్థ్యం, శౌర్యంపై ప్రతి ఒక్కరికీ నమ్మకం ఉంది
  • ప్రధాని మోదీకి మాత్రం లేదు
  • మన భూమిని చైనా తన అధీనంలోకి తీసుకుంది
  • ప్రధాని చెబుతోన్న అసత్యాల వల్ల ఈ పరిస్థితి కొనసాగుతుంది
భారత్‌-చైనా సరిహద్దుల వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీరుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కొన్ని రోజులుగా తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ పిరికితనం వల్లే చైనా ఇటువంటి చర్యలకు పాల్పడుతోందంటూ ఆయన మరోసారి ఆరోపణలు గుప్పించారు.

'భారత ఆర్మీ సామర్థ్యం, శౌర్యంపై ప్రతి ఒక్కరికీ నమ్మకం ఉంది. ప్రధాని మోదీకి మాత్రం లేదు. ఆయన పిరికితనమే మన దేశానికి చెందిన ఆ భూమిని చైనా తీసుకునేలా చేసింది. ప్రధాని చెబుతోన్న అసత్యాలు.. భవిష్యత్తులోనూ ఆ భూమి వారి అధీనంలోనే ఉండేలా చేస్తాయి' అని రాహుల్ గాంధీ ఆరోపిస్తూ ట్వీట్ చేశారు.
Rahul Gandhi
Congress
Narendra Modi
BJP

More Telugu News