MS Dhoni: ధోనీ రిటైర్ మెంట్ తో కన్నీరు పెల్లుబుకుతోంది: ప్రిన్స్ మహేశ్ బాబు 

Mahesh Babu Remembers Iconic Sixer of Dhoni
  • ధోనీ రిటైర్ మెంట్ తో కన్నీరు పెల్లుబుకుతోంది
  • వరల్డ్ కప్ ను అందించిన క్షణాలు కళ్లముందున్నాయి
  • టేక్ ఏ బౌ ఎంఎస్ ధోనీ అంటూ ట్వీట్
నిన్న అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతూ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రకటన చేసిన తరువాత, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. 2011లో ఇండియా వరల్డ్ కప్ ను గెలిచిన సమయంలో తాను కూడా వాంఖడే స్టేడియంలో ఉన్నానని గుర్తు చేసుకున్నారు. నాడు ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ధోనీ సిక్స్ ను తాను మరచిపోలేనని చెప్పారు. అది ఎంతో గర్వపడే ఘటనని, ధోనీ రిటైర్ మెంట్ వార్తతో తనకు కన్నీరు పెల్లుబికిందని వ్యాఖ్యానించారు. క్రికెట్ ఎప్పుడూ ఒకేలా ఉందని చెబుతూ, 'టేక్ ఏ బౌ ఎంఎస్ ధోనీ' అంటూ ట్వీట్ పెట్టారు.
MS Dhoni
Mahesh Babu
Twitter

More Telugu News