Corona Virus: దేశంలో కొత్తగా 63,489 మందికి కరోనా

Spike of 63489 cases and 944 deaths reported in India
షార్ట్స్‌లో చూడండి
భారత్‌లో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. భారత్‌లో 24 గంటల్లో 63,489 మందికి కరోనా సోకిందని, అదే సమయంలో 944 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
      
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 25,89,682కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 49,980 కి పెరిగింది. ఇక 6,77,444 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 18,62,258 మంది కోలుకున్నారు.
                                                          
కాగా, నిన్నటి వరకు మొత్తం 2,93,09,703 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 7,46,608 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వివరించింది.
Go Back to Shorts
Corona Virus
COVID-19
India

More Telugu News