Hemant Soren: ధోనీ కోసం ఒక్క ఫేర్ వెల్ మ్యాచ్ పెట్టండి... బీసీసీఐని కోరిన జార్ఖండ్ సీఎం

Hemant Soren Asks BCCI to Conduct a Farewell Match for MS Dhoni
  • రాంచీలో వీడ్కోలు మ్యాచ్ పెట్టండి
  • ఘనమైన వీడ్కోలు ఇద్దామన్న హేమంత్ సోరెన్
  • ఇంకా స్పందించని బీసీసీఐ
భారత క్రికెట్ కు ఎన్నో విజయాలను అందించిన మహేంద్ర సింగ్ ధోనీ కోసం ఒక్క ఫేర్ వెల్ మ్యాచ్ ని పెట్టాలని, దాన్ని అతని సొంత రాష్ట్రమైన జార్ఖండ్ ను వేదిక చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బీసీసీఐని కోరారు. రాంచీలో ఓ మ్యాచ్ ని  జరిపి, ధోనీకి ఘనమైన వీడ్కోలును ఇచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన అన్నారు.

ధోనీ సొంత రాష్ట్రం జార్ఖండ్ అన్న సంగతి తెలిసిందే. కాగా, హేమంత్ సోరెన్ అభ్యర్థనపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ధోనీ కోసం ఫేర్ వెల్ మ్యాచ్ నిర్వహిస్తే, అది అతని ఫ్యాన్స్ కు ఎంతో ఆనందకరమైన రోజవుతుందనడంలో సందేహం లేదు. కాగా, నిన్న తాను క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటిస్తున్నట్టు ధోనీ అనూహ్య ప్రకటన చేయడం అభిమానులకు షాక్ కలిగించింది.
Hemant Soren
MS Dhoni
Farewell Match
Ranchi
BCCI

More Telugu News