Pawan Kalyan: నిహారిక నిశ్చితార్థంలో పవన్ కల్యాణ్ కనిపించని కారణమిదే!

Why Pawan Kalyan didnot apper in Niharika Engagement
  • హైదరాబాద్ లో వేడుకగా నిశ్చితార్థం
  • చాతుర్మాస దీక్షలో ఉన్న పవన్ కల్యాణ్
  • ఉదయమే నాగబాబు ఇంటికి వెళ్లి పలకరింపు
గురువారం రాత్రి హైదరాబాద్ లో మెగా తనయ నిహారిక నిశ్చితార్థం వేడుకగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ మాత్రం కనిపించలేదు. సొంత అన్న కూతురి నిశ్చితార్థానికి ఎందుకు వెళ్లలేదని నెట్టింట పెద్ద చర్చే జరిగింది. అయితే, కేవలం ఫోటోల్లో మాత్రమే పవన్ కనిపించలేదు. ఉదయాన్నే నాగబాబు నివాసానికి వెళ్లిన ఆయన కాబోయే దంపతులను ఆశీర్వదించారట.

ఇక రాత్రి ఎందుకు కనిపించలేదంటే, పవన్ కల్యాణ్ గత నెల చాతుర్మాస దీక్షను ప్రారంభించారు. ఇది నాలుగు నెలలు కొనసాగే దీక్ష. ఈ దీక్షలో ఉన్న వారు సాయంత్రం ఆరు తరువాత ఇల్లు విడిచి వెళ్లకూడదన్న నిబంధన ఉంది. ఎంగేజ్ మెంట్ రాత్రి పూట కావడం, బయటకు వచ్చిన ఫోటోలన్నీ అప్పుడు తీసినవే కావడంతో పవన్ కల్యాణ్ కనిపించలేదు.
Pawan Kalyan
Niharika
Engagement

More Telugu News