Bay of Bengal: నేడు, రేపు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు: హెచ్చరించిన ఐఎండీ

  • బంగాళాఖాతంలో తీవ్రమైన అల్పపీడనం
  • ఇప్పటికే గత మూడు రోజులుగా వాన
  • తెలంగాణకు ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ఐఎండీ
IMD Warns Telangana on Heavy Rains

తెలంగాణలో ఆది, సోమవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్గాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రానికి ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేస్తూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత తీవ్రమవడమే ఇందుకు కారణమని పేర్కొంది.

కాగా, గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. సగటున రాష్ట్రమంతా 4.52 సెంటీమీటర్ల వర్షం కురిసిందని ఐఎండీ పేర్కొంది. పలు ప్రాంతాల్లో ఇప్పటికే వాగులు, వంకలు పొంగుతున్నాయి.

More Telugu News