Chandrababu: భారత క్రికెట్లో ఇక ఈ జెర్సీ కనిపించదేమో... ధోనీ రిటైర్మెంటుపై చంద్రబాబు వ్యాఖ్యలు

Chandrababu responds on Dhoni retirement from International cricket
  • అంతర్జాతీయ క్రికెట్ కు ధోనీ వీడ్కోలు
  • ఆల్ ది బెస్ట్ చెప్పిన చంద్రబాబు
  • భారత్ ను గర్వించేలా చేశాడంటూ కితాబు
టీమిండియా క్రికెట్ చరిత్రలో ఓ శకం ముగిసింది. భారత జట్టును అన్ని ఫార్మాట్లలో అగ్రభాగాన నిలిపిన ఘనతర నాయకుడు మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. దీనిపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్పందించారు.

 "ధోనీ ఆరంభించబోయే సరికొత్త జీవన ప్రస్థానంలో అంతా మంచే జరగాలని శుభాకాంక్షలు చెబుతున్నాను. క్రికెట్లో ఎన్నో అత్యుత్తమ ఘట్టాలను మనకు అందించిన ఈ భారత జెర్సీ ఇక కనిపించదేమో! మీరు భారత్ గర్వించేలా చేశారు ధోనీ. మీరు సాధించిన విజయాలను ఎంతో విలువైనవిగా భావిస్తాం. వీడ్కోలు ఎంఎస్ ధోనీ" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

Chandrababu
MS Dhoni
Retirement
Cricket
Team India

More Telugu News