Virat Kohli: నువ్వు దేశం కోసం సాధించిన ఘనతలు ప్రతి ఒక్కరి హృదయంలో పదిలంగా ఉంటాయి: కోహ్లీ

Virat Kohli responds Dhoni retirement from international cricket
  • అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ధోనీ
  • సన్నిహితులు ఇలాంటి నిర్ణయం ప్రకటించడం బాధాకరమన్న కోహ్లీ
  • అందుకో వందనాలు అంటూ ట్వీట్
అంతర్జాతీయ క్రికెట్ కు మహేంద్ర సింగ్ ధోనీ గుడ్ బై చెప్పడం భారత క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీసింది. దీనిపై టీమిండియా ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ప్రతి క్రికెటర్ ఏదో ఒకరోజు తన కెరీర్ కు ముగింపు పలకాల్సిందేని, అయితే మనకు బాగా సన్నిహితులైన వాళ్లు ఇలాంటి నిర్ణయం ప్రకటించినప్పుడు మనలో భావోద్వేగాలు అధికం అవుతాయని పేర్కొన్నాడు.

"నువ్వు దేశం కోసం సాధించిన ఘనతలు ప్రతి ఒక్కరి హృదయంలో పదిలంగా ఉంటాయి. నువ్వు నా పట్ల చూపించే పరస్పర గౌరవం, సహృదయత ఎప్పటికీ నాలో ఉండిపోతాయి. ఈ ప్రపంచం విజయాలను చూస్తుంది, కానీ నేను వ్యక్తిని చూస్తాను. ధన్యవాదాలు నాయకా! అందుకో వందనాలు!" అంటూ కోహ్లీ ట్విట్టర్ లో తన అభిప్రాయాలను పంచుకున్నాడు.
Virat Kohli
MS Dhoni
Retirement
Internatioanl Cricket
Team India

More Telugu News