Helicopter: భూపాలపల్లి వాగులో చిక్కుకున్న 12 మందిని రక్షించిన సైనిక హెలికాప్టర్

Army helicopter rescued twelve farmers in Bhupalapalli district
  • తెలంగాణలో ఎడతెరిపి లేని వానలు
  • పొంగిపొర్లుతున్న వాగులు
  • హెలికాప్టర్ పంపిన కేటీఆర్
గత మూడ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఉదయం ఓ మోస్తరు ప్రవాహంతో ఉన్న వాగులు ఈ సాయంత్రానికి ఉగ్రరూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా కందనపల్లి చీమలవాగులో 12 మంది రైతులు చిక్కుకుపోయారు.
 
వారిని కాపాడేందుకు పోలీసులు, సహాయక సిబ్బంది ఎంత ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు. పరిస్థితి క్షీణిస్తుండడంతో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి మంత్రి కేటీఆర్ కు సమాచారం అందించారు. దాంతో ఆయన వెంటనే స్పందించి అప్పటికే వరద విధుల్లో ఉన్న సైనిక హెలికాప్టర్ ను చీమలవాగు వద్దకు పంపారు. ఆర్మీ సిబ్బంది ఎంతో శ్రమించి ఆ రైతులను క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ కూడా ఎమ్మెల్యే గండ్రను అడిగి తెలుసుకున్నారు.
Helicopter
Army
Rescue
Farmers
Jayashankar Bhupalpally District

More Telugu News