Mohan Babu: కొత్త సినిమా టైటిల్ ను అనౌన్స్ చేసిన మోహన్ బాబు

Mohan Babu announces his new movie
  • 'సన్ ఆఫ్ ఇండియా' చిత్రాన్ని ప్రకటించిన మోహన్ బాబు
  • సొంత బ్యానర్ పై తెరకెక్కుతున్న చిత్రం
  • ప్రస్తుతం 'ఆకాశమే నీ హద్దురా' సినిమాలో నటిస్తున్న డైలాగ్ కింగ్
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు చివరగా 'మహానటి' సినిమాలో నటించారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఆ చిత్రంలో ఎస్వీ రంగారావు పాత్రను పోషించి, మెప్పించారు. సినిమాల విషయంలో ఇటీవలి కాలంలో ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గుర్తింపు కలిగిన పాత్రలను మాత్రమే ఆయన ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం తమిళ హీరో సూర్య హీరోగా తెరకెక్కుతున్న 'ఆకాశమే నీ హద్దురా' చిత్రంలో నటిస్తున్నారు.

తాజాగా ఆయన మరో సినిమాను ప్రకటించారు. సొంత బ్యానర్ శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కిన్న 'సన్ ఆఫ్ ఇండియా' చిత్రంలో ఆయన ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను లాంచ్ చేశారు. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మాటల రచయిత డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
.
Mohan Babu
Tollywood
Sun of India Movie

More Telugu News