SP Charan: ఆ చానల్లో వచ్చిన వార్త కరెక్ట్ కాదు: ఎస్పీ బాలు ఆరోగ్యంపై స్పష్టతనిచ్చిన కుమారుడు

sp charan clarifies about his father sp balasubrahmanyam health condition
  • కరోనా బారినపడిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
  • చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స
  • గత రాత్రి విషమించిన బాలు ఆరోగ్యం
కరోనా వైరస్ కారణంగా గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో విచారం నెలకొంది. ఎస్పీ బాలు పరిస్థితి విషమం అంటూ మీడియాలో ప్రముఖంగా ప్రసారమైంది. అయితే తమిళ మీడియా సంస్థ 'పుదియతలైమురై' ఓ అడుగు ముందుకేసి తీవ్రస్థాయిలో ఓ వార్తను ప్రసారం చేసింది. దీనిపై ఎస్పీ బాలు కుమారుడు ఎస్పీ చరణ్ స్పందించారు. తన తండ్రి ఆరోగ్యం గురించి పుదియతలైమురైలో వచ్చిన వార్త కరెక్ట్ కాదని స్పష్టం చేశారు.

ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న మాట నిజమే అయినా, ఎంజీఎం ఆసుపత్రి వైద్య నిపుణుల పర్యవేక్షణలో మెరుగైన చికిత్స అందుకుంటూ ఇప్పటివరకు భద్రంగానే ఉన్నారని వెల్లడించారు. కాస్త ఆలస్యమైనా సరే ఎస్పీబీ తప్పకుండా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగొస్తారని ధీమా వ్యక్తం చేశారు. తన తండ్రి ఆరోగ్యంపై ఆందోళన చెందుతూ, ప్రార్థనలు చేస్తున్న వారికి ఎస్పీ చరణ్ కృతజ్ఞతలు తెలిపారు.
SP Charan
SP Balasubrahmanyam
Corona Virus
MGM Hospital
Chennai

More Telugu News