Raviteja: రవితేజ సినిమా విడుదలపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!

Gopichand Malineni gives clarity on Raviteja movie release
  • ఓటీటీ సంస్థల నుంచి నిర్మాతలకు మంచి ఆఫర్లు 
  • రవితేజ 'క్రాక్' సినిమా విడుదలపై ఇటీవల ప్రచారం
  • 'థియేటర్లలోనే' అంటూ చెప్పిన దర్శకుడు గోపీచంద్    
కరోనా కారణంగా వచ్చిన లాక్ డౌన్ వల్ల నష్టపోయిన రంగంలో సినిమా రంగం కూడా వుంది. ఎన్నో సినిమాల షూటింగులు ఆగిపోయాయి.. పూర్తయిన సినిమాలు థియేటర్లు మూతబడడం వల్ల విడుదలకు నోచుకోవడం లేదు.

అయితే, కొందరు నిర్మాతలు ఓటీటీ వేదికల్ని ఎంచుకుంటూ తమ సినిమాలను విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని సినిమాలకు ఓటీటీ సంస్థల నుంచి మంచి ఆఫర్లు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో రవితేజ నటిస్తున్న 'క్రాక్' సినిమా కూడా ఓటీటీ ద్వారా విడుదలవుతుందంటూ ఇటీవల ప్రచారం జరిగింది. దీంతో థియేటర్లో సందడి చేయాలనుకున్న రవితేజ అభిమానులు కాస్త అప్సెట్ అయ్యారు.

ఈ నేపథ్యంలో ఈ చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ రోజు దీనిపై సోషల్ మీడియాలో స్పందించారు. 'క్రాక్ సినిమా కేవలం థియేటర్లలోనే..' అంటూ క్లారిటీ ఇస్తూ, ఆ చిత్రంలోని రవితేజ ఫొటోను కూడా పోస్ట్ చేశారు. దీంతో ఈ చిత్రం విడుదలపై జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. ఇదిలావుంచితే, రవితేజ ఈ లాక్ డౌన్ ఖాళీ సమయంలో పలు దర్శకులు చెబుతున్న కథలు వింటూ.. తాజాగా కొన్ని ప్రాజక్టులకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు.
Raviteja
Gopichand Malineni
crack Movie
OTT

More Telugu News