Sushant Singh Rajput: అంకిత ఉంటున్న ఫ్లాట్ కు ఈఎంఐలు చెల్లిస్తున్న సుశాంత్!

As per sources Sushant pays installments for Ankita flat
  • సుశాంత్ వ్యవహారంలో ఈడీ దర్యాప్తు
  • దర్యాప్తులో ఆసక్తికర అంశాలు!
  • రూ.4.5 కోట్ల ఖరీదైన ఇంటిలో ఉంటున్న అంకిత లోఖండే
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ రాజ్ పుత్ మరణం నేపథ్యంలో, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆర్థిక కోణాల్లో దర్యాప్తు చేస్తోంది. ముఖ్యంగా, సుశాంత్ ఖాతాలోని రూ.15 కోట్ల ఎటు వెళ్లాయన్నదానిపై దృష్టి సారించింది. అయితే ఈడీ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం... సుశాంత్ మాజీ గాళ్ ఫ్రెండ్ అంకితా లోఖండే నివసిస్తున్న ఖరీదైన ఫ్లాట్ కు సుశాంతే ఈఎంఐలు చెల్లిస్తున్నట్టు గుర్తించారు.

ముంబయిలోని మలాద్ ప్రాంతంలో ఉన్న ఈ ఫ్లాట్ ఖరీదు రూ.4.5 కోట్లు కాగా, కొనుగోలు సమయంలో ఈ ఫ్లాట్ కోసం ఎంత చెల్లించిందీ తెలియరాలేదు. జాతీయ మీడియా వర్గాల సమాచారం ప్రకారం కేవలం కొన్ని ఇన్ స్టాల్ మెంట్లు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయట.

కాగా, సుశాంత్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి కూడా ఈ ఫ్లాట్ గురించి ప్రస్తావించింది. తానే ఈఎంఐలు కడుతున్నా గానీ అంకితను ఆ ఫ్లాట్ ను ఖాళీ చేయాలని సుశాంత్ ఎప్పుడూ కోరలేదని రియా చెప్పినట్టు సమాచారం. ఈ విషయమై మీడియా వర్గాలు అంకితను సంప్రదించే ప్రయత్నం చేయగా ఆమె స్పందించలేదు.
Sushant Singh Rajput
Ankita Lokhande
Flat
EMI
ED

More Telugu News