Doctor Mamatha: ఆమెకే కాదు.. ఆమెను విచారిస్తున్న పోలీసులకు కూడా ప్రమాదకరమే: రాయపాటి కోడలు తరపు లాయర్

  • ఇప్పుడిప్పుడే ఆమె కరోనా నుంచి కోలుకుంటున్నారు
  • ఏడు గంటల పాటు ఆమెను విచారించడం మంచిది కాదు
  • ప్రమాద ఘటనలో కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, ఫైర్ శాఖల తప్పిదం కూడా ఉంది
Doctor Mamatha not yet recovered from Corona says her lawyer

గుంటూరు రమేశ్ ఆసుపత్రి మేనేజ్ మెంట్ సభ్యురాలు అయిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కోడలు డాక్టర్ మమతను విజయవాడ పోలీసులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. 6 గంటలకు పైగా ఆమె విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విజయవాడ ఆసుపత్రికి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. విజయవాడ పోలీసులు నోటీసులు ఇవ్వడం వల్లే తాను విచారణకు హాజరయ్యానని తెలిపారు. తనపై వచ్చినవి కేవలం ఆరోపణలు మాత్రమేనని చెప్పారు. తాను కేవలం గుంటూరు రమేశ్ హాస్పిటల్స్ వ్యవహారాలను మాత్రమే చూస్తున్నానని తెలిపారు.

ఈ సందర్బంగా డాక్టర్ మమత తరపు లాయర్ మాట్లాడుతూ, ఆమె ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్నారని చెప్పారు. ఏడు గంటల పాటు విచారించడం మంచిది కాదని... ఆమె పూర్తిగా కోలుకోకపోవడం వల్ల ఆమెకు ప్రమాదమని... ఆమెను విచారిస్తున్న పోలీసులకు మరింత ప్రమాదకరమని అన్నారు. పోలీసులకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్న వారిని ఇబ్బంది పెట్టడం సరికాదని చెప్పారు. విజయవాడ ఆసుపత్రితో సంబంధం లేని వ్యక్తిని పదేపదే ఇబ్బంది పెట్టడం మంచిది కాదని అన్నారు. ప్రమాద ఘటనలో జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, ఫైర్ శాఖల తప్పిదం కూడా ఉందని చెప్పారు. స్థితిగతులను అధ్యయనం చేయకుండా జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, ఢీహెచ్ఎంవో, ఫైర్ అధికారులు అనుమతి ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

More Telugu News