Vijayasai Reddy: 73 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఇదొక రికార్డు: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy explains how much their government allocated
  • పేదల సంక్షేమమే తమ ధ్యేయమని ఉద్ఘాటన
  • 14 నెలల్లో రూ.59 వేల కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడి
  • బాబూ ఈ ధైర్యం మీకుందా? అంటూ ట్వీట్
పేదల అభ్యున్నతే తమ ప్రభుత్వ ప్రధాన ఆశయం అంటూ విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. కేవలం 14 నెలల కాలంలో పేదల సంక్షేమం మీద జగన్ ప్రభుత్వం చేసిన వ్యయం అక్షరాలా రూ.59,425 కోట్లు అని వెల్లడించారు. 73 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఇదొక రికార్డు అని పేర్కొన్నారు. బాబూ... మీ 14 ఏళ్ల పాలనలో ఈ తరహాలో ఏంచేశారో అధికారికంగా లెక్కలు విడుదల చేసే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. అంతేకాదు, వైసీపీ పాలనలో దేనికి ఎంత కేటాయించారో ఓ చార్టు కూడా తన ట్వీట్ లో పొందుపరిచారు.
Vijayasai Reddy
Allocations
YSRCP
Government
Chandrababu
Andhra Pradesh

More Telugu News