Corona Virus: ఈ రెండింటి ద్వారా కరోనా సోకదు: ప్రపంచ ఆరోగ్య సంస్థ

  • ఆహారం, ప్యాకేజింగ్ ల ద్వారా కరోనా సోకదు
  • ఇలాంటి కేసు ఇంత వరకు ఒకటి కూడా రాలేదు
  • ఆహార పదార్థాలను కొనుగోలు చేయడానికి భయపడొద్దు
Corona virus can not spread with food clarifies WHO

ప్రపంచ వ్యాప్తంగా కరోనా స్వైర విహారం చేస్తోంది. ఎక్కడ చూసినా కరోనా భయాందోళనలే కనిపిస్తున్నాయి. దేన్ని ముట్టుకోవాలన్నా జనాలు భయపడిపోతున్నారు. కరోనా సోకకుండా ఎవరికి వారు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక కీలక ప్రకటన చేసింది. ఆహారం ద్వారా కరోనా సోకదని ప్రకటించింది. ఆహారం ద్వారా కానీ, ప్యాకేజింగ్ ల ద్వారా కానీ కరోనా సోకినట్టు ఇంత వరకు ఒక్క కేసు కూడా రాలేదని తెలిపింది. ఆహార పదార్థాలను కొనుగోలు చేయడానికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పింది. దీనికి సంబంధించి చైనా చేసిన ఓ పరిశోధనా ఫలితాలను డబ్ల్యూహెచ్ఓ ఆధారాలుగా చూపింది.

More Telugu News