MS Dhoni: చెన్నై చేరుకున్న ధోనీ... ఐపీఎల్ సందడి మొదలుపెట్టిన సూపర్ కింగ్స్!

Skipper MS Dhoni arrives Chennai as Super Kings started celebrations
  • శిక్షణ శిబిరం కోసం చెన్నై వచ్చిన ధోనీ
  • కరోనా టెస్టులో ధోనీకి నెగెటివ్
  • విజిల్ పోడు అంటూ ట్వీట్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్
కరోనా పరీక్షల్లో నెగెటివ్ అని స్పష్టం కావడంతో మహేంద్ర సింగ్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ శిక్షణ శిబిరంలో పాల్గొనేందుకు చెన్నై చేరుకున్నాడు. ఐపీఎల్ లో చెన్నై జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ధోనీ చెన్నై రావడంతో అభిమానుల్లో ఆనందం అంబరాన్నంటుతోంది. ఇంగ్లాండ్ లో గత సంవత్సరం జరిగిన వరల్డ్ కప్ తర్వాత ధోనీని మైదానంలో చూడని అభిమానులు, ఇప్పుడు ఐపీఎల్ లో తమ అభిమాన క్రికెటర్ మెరుపులు చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.

రైనా, దీపక్ చహర్ తదితర క్రికెటర్లతో కలిసి ప్రత్యేక విమానంలో వచ్చిన ధోనీ చెన్నై ఎయిర్ పోర్టులో కెమెరాలకు చిక్కాడు. ఈ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తమ అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ లో ఫొటో పోస్టు చేసింది. తాలా దర్శనం రీలోడెడ్ అంటూ ట్వీట్ చేసింది. విజిల్ పోడు (ఈల కొట్టండి) అంటూ అభిమానులను ఉత్సాహపరిచింది. కాగా, రవీంద్ర జడేజా మినహా కీలక ఆటగాళ్లందరూ ఒక్కొక్కరుగా చెన్నై చేరుకుంటున్నారు.
MS Dhoni
Chennai
Super Kings
IPL 2020
Corona Virus
UAE

More Telugu News